శ్రీ విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు
త్రిగుళ్ళ రామమూర్తి, విశ్రాంత తెలుగు పండితులు, తీగుల్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ.
ఆ. వె. మామిడాకులున్న మంచితోరణములు
ఇంటిగుమ్మమునకు ఎంతొ శోభ
నేతి భక్ష్యము రుచి స్వాతిముత్యము శోభ
అద్భుతమ్ము నేటి మన ఉగాది
ఆ. వె. పండుగన్ననిదియె ప్రతివర్షమున వచ్చు
తెలుగువారిసొత్తు కలలు గనిన
ఆరు ఋతువులుండు యద్భుతమైనట్టి
శ్రీ విళంబివచ్చె పావనముగ
ఆ. వె. వేపపువ్వు గుడము విలువైన తింత్రిణి
మామిడుప్పుకార మనగనివియె
ఆరు ఋచుల ద్రవము ఔషధరూపాన
గ్రోలవలయునేడు కూర్మితోడ
హేవళంబి సంవత్సరానికి వీడ్కోలు
ఆ. వె. హేవళంబి వచ్చి సేవచేసి వెడలె
నీకు నీవె సాక్షి నిక్కముగను
బుధుని ఫలములన్ని పొందియుంటిమిగదా
మరుపురాని స్మృతులు మరలరావు
No comments:
Post a Comment