Pages

Saturday, August 27, 2011

molla rAmAyaNam-avatArika


శ్రీ

రామాయణము

అవతారిక

ఇష్టదేవతా సన్నుతి


శ్రీ మహిమాభిరాముఁడు వ
శిష్ఠమహాముని పూజితుండు సు
త్రామవధూకళాభరణ
రక్షకుఁ డాశ్రితపోషకుండు దూ
ర్వామలసన్నిభాంగుఁడు మ
హా గుణశాలి దయాపరుండు, శ్రీ
రాముఁడు ప్రోచు భక్తతతి
రంజిలునట్లుగ నెల్లకాలమున్ ||1||

ఉ. శ్రీనగమందిరుండమరసేవితుఁ డర్ధశశాంకమౌళి స
న్మౌనిమనహ్పయోజదిననాయకుఁ దబ్ధభవామరేశ్వర
ధ్యానలసత్ప్రసన్నుఁ డతిధన్యుఁడు శేషవిభూషణుండు వి
ద్యానిధి మల్లికార్జునుఁడు తా నిడు మాకు శుభంబు లొప్పగన్ ||2||

ఉ. తెల్లని పుండరీకముల తేజము మెచ్చనికన్నుదోయితో
నల్లైశుక్రనీలరుచి నవ్వెడు కోమల దేహకాంతితో
నల్లనఁబిల్లఁగ్రోవి కరమంచిత సంజ్ఞల నింపు నింపఁగా
గొల్లతలన్ విరాళితగఁ గొల్పెడు కృష్ణుఁడు ప్రోచుఁగావుతన్ ||3||

ఉ. మించి సమస్తలోకములు మిన్నక తాఁదన నేర్పుమీఱ ని
ర్మించి, ప్రగల్భతన్ మెఱసి, మేలును గీడును బ్రాణికోట్లు సే
వించ ఘటించి శాస్త్రములు, వేదములుంగొనియాడుచుండు నా
కాంచన గర్భుఁడిచ్చు నధికంబుగ నాయువు నీప్సితార్థముల్. ||4||

సీ. చంద్రఖండ కలాపుఁ జారువామనరూపుఁ
గలితచంచలకర్ణుఁ గమలవర్ణు
మోదకోజ్జ్వలబాహు మూషకోత్తమవాహు
భద్రేభవదను సద్భక్త సదను
సన్మునిస్తుతిపాత్రు శైలసంభవపుత్రు
ననుదినామోదు విద్యాప్రసాదుఁ
బరమదయాభ్యాసుఁ బాషాంకుశోల్లాసు
నురుతరఖ్యాతు నాగోపవీతు.

తె. లోకవందితగుణవంతు నేకదంతు
నతులహేరంబు సత్కరుణావలంబు
విమలరవికోటితేజు శ్రీవిఘ్నరాజుఁ
బ్రథితవాక్ప్రౌఢి సేవించి ప్రస్తుతింతు. ||5||

చ. కరిముఖుఁడుంగుమారుఁడువికారపుఁజేఁతలముద్దుసూపుచున్
గురువులువాఱుచున్నెదుట గుప్పునదాటుచుఁగన్నుదోయితో
శిరములు రాయుచుం గబరిఁజేర్చినచంద్రునిఁ బట్టి తీయఁగాఁ
గరములఁ జాఁప నవ్వెడు జగమ్ములతల్లి శుభంబు లీవుతన్ ||6||

ఉ. సామజయుగ్మ మింపలరఁ జల్లనినీరు పసిండికుండలన్
వేమఱు వంచివంచి కడువేడుకతో నభిషిక్తఁ జేయఁగాఁ
దామరపువ్వుగద్దియ ముదంబుననుండెడిలోకమాత మా
కామునితల్లి లోకములఁ గాచు గృపా మతి నెల్లకాలమున్. ||7||

మేలిమిమంచుకొండ నుపమింపఁగఁజాలినయంచ నెక్కి, వా
హ్యాళి నటించి వచ్చుచతురాస్యు నెదుర్కొని నవ్వుదేరగా
వాలికసోగకన్నుల నివాళి యొనర్చి ముదంబు గూర్చు వి
ద్యాలయవాణి శబ్దముల నర్థములన్ సతతంబు మాకిడున్. ||8||

సంస్కృతాంధ్ర మహాకవి స్తుతి

సీ. సురసన్నుతజ్ఞాను సువివేకి వాల్మీకి
నఖిలవేదాగమాభ్యాసు వ్యాసు
ఘోరాంధకారప్రభారవి భారవి
సత్కాంతిహిమకరశ్లాఘు మాఘు
వివిధకళాన్విత విఖ్యాతి భవభూతిఁ
బ్రకటకార్యధురీణు భట్టబాణు
మానినీలొకసమ్మదముద్రు శివభద్రుఁ
గవితారసోల్లాసుఁ గాళిదాసు

తె. స్తుతగుణొద్దము నాచనసోము భీము
నవ్యమంజులవాగ్ధుర్యు నన్నపార్యు
రసికుఁడైనట్టిశ్రీనాథు రంగనాథుఁ
దిక్కకవిరాజు భోజు నుతించి మించి ||9||

క. తొల్లిటి యిప్పటి సత్కవి
వల్లభులను రసికవినుతవాగ్విభవకళా
మల్లులఁగవితారచనల
బల్లిదులైనట్టి ఘనుల భక్తిగఁదలఁతున్. ||10||

గురులింగజంగమార్చన
పరుఁడును శివభక్తిరతుఁడు బాంధవహితుఁడున్
గురుఁ డాతుకూరికేసయ
వరపుత్రిని మొల్ల యనఁగ వఱలినదానన్ || 11||

మొల్ల కవితా విలసనము

సీ. దేశీయ పదములు దెనుఁగులు సాంస్కృతుల్
సంధులు ప్రాజ్ఞుల శబ్ద వితతి
శయ్యలు రీతులుఁ జాటు ప్రబంధంబు
లాయా సమాసంబు లర్థ దృష్టి
భావార్థములుఁ గావ్య పరిపాకములు రస
భావ చమత్కృతుల్ పలుకు సరవి
బహు వర్ణములును విభక్తులు ధాతు
లలంకృతి ఛందో విలక్షణములుఁ

తే. గావ్య సంపద క్రియలు నిఘంటువులును
గ్రమము లేవియు నెఱుగ, విఖ్యాత గోప
వరపు శ్రీకంఠమల్లేశు వరముచేత
నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుదాన || 12||

క. చెప్పుమని రామచంద్రుఁడు
సెప్పించిన పలుకుమీదఁ జెప్పెద నేనె
ల్లప్పుడు నిహపరసాధన
మిప్ప్పుణ్య చరిత్ర, తప్పు లెంచకుఁడు కవుల్ ! || 13||

వ. అని మఱియును ||14||

క. వలిపపు సన్న పయ్యెదను వాసిగ గందపుఁ బూఁతతోడుతన్
గొలదిగఁగానవచ్చు వలి గుబ్బ చనుంగవ ఠీవి నొప్పఁగాఁ
దెలుఁగని చెప్పుచోటఁ గడుఁ దేటలఁ మాటలఁ గ్రొత్త రీతులం
బొలుపు వహింపకున్న, మఱి పొందగునే పటహాదిశబ్దముల్ ? ||15||

క. మును సంస్కృతములఁ దేటగఁ
దెనిఁగించెడిచోట నేమి దెలియక యుండన్
దన విద్య మెఱయఁ గ్రమ్మఱ
ఘన మగు సంస్కృతముఁ జెప్పఁగా రుచి యగునే ? ||16||

ఆ. తేనె సోఁక నోరు తీయన యగురీతిఁ
దోడ నర్థ మెల్లఁ దోఁచకుండ
గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూఁగ చెవిటివారి ముచ్చటగును. ||17||

క. కందువమాటలు, సామెత
లందముగాఁ గూర్చి చెప్ప నది తెనుఁగునకుం
బొందై, రుచియై, వీనుల
విందై, మఱి కానుపించు విబుధుల మదికిన్ ||18||

వ. అని మఱియును ||19||

క. అది రఘు రాము చరితము
నాదరముగ విన్నఁ గ్రొత్తయై, లక్షణ సం
పాదమ్మై, పుణ్యస్థితి
వేదమ్మైతోఁచకున్న వెఱ్ఱినె చెప్పన్ ? || 20||

ఉ. రాజితకీర్తియైన రఘురాము చరిత్రము మున్ గవీశ్వరుల్
తేజ మొలర్పఁజెప్పిరని తెల్సియుఁ గ్రమ్మఱఁ జెప్పనే? లనన్
భూజనకల్పకం బగుచు, భుక్తికి ముక్తికి మూల మంచు, నా
రాజును దైవమైన రఘురాము నుతించినఁదప్పు గల్గునే ? || 21 ||

క. వారంగన శ్రీరాముని
పే రిడి రాచికిలుకఁ బిలిచి పెంపు వహించెన్;
నేరుపు గల చందంబున
నా రాముని వినుతి సేయ హర్షముగాదే ? ||22||

క. నేరిచి పొగడినవారిని,
నేరక కొనియాడువారి నిజ కృప మనుపం
గారణ మగుటకు భక్తియె
కారణ మగుఁగాని చదువు కారణ మగునే ? || 23||

ఉ. సల్లలిత ప్రతాప గుణ సాగరుఁడై విలసిల్లి, ధాత్రిపై
బల్లిదుఁడైన రామ నరపాలకునిన్ స్తుతి సేయు జిహ్వకున్
జిల్లర రాజలోకము జేకొని మెచ్చఁగ నిచ్చ పుట్టునే?
యల్లము బెల్లముం దినుచు నప్పటి కప్పటి కాస సేయునే ? ||24||

2 comments: